ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 7:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఈ నెల 20న జరిగే జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయండి- ఏపీడబ్ల్యూజేఎఫ్

ఈ నెల 20న జరిగే జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయండి
– ఏపీడబ్ల్యూజేఎఫ్

బేతంచెర్ల. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 4.

జర్నలిస్టులకు రూ 50 కోట్ల వెల్ఫేర్ పండుగ కేటాయించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్,డిమాండ్ చేశారు శుక్రవారం బేతంచర్ల లో ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలోఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల లోని వివేకానంద ఆడిటోరియంలోజరిగే నంద్యాల జిల్లా ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు,వివిధ పార్టీల జిల్లా అధ్యక్షులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు,రాయలసీమ ఇన్చార్జి జయరాజ్ లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.జిల్లాలోని  జర్నలిస్టులు అందరూ హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ,సంక్షేమం,వృత్తి భద్రత కోసం యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.జర్నలిస్టులు ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని,ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకుని సంఘ కార్యకలాపాల్లోభాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇళ్ల స్థలాలు,చిన్న పత్రికల జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం,రైల్వే పాసుల పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలోమండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల గౌరవ అధ్యక్షులుగా ఈ వెంకటేశ్వర గౌడ్ అధ్యక్షులుగా వై నాగ మధు,ఉపాధ్యక్షులుగా పి నాగరాజు,ప్రధాన కార్యదర్శిగాజి.వేణుగోపాల్,సహాయ కార్యదర్శిగా కే.సుబ్బరాయుడు ట్రెజరర్ గా పి మదన భూపాల్ న